కరోనాపై జగన్‌కు అంత నిర్లక్ష్యమా.. ఏపీని దేవుడే కాపాడాలి: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి . కరోనా సమీక్ష తర్వాత సీఎం చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. జగన్ వ్యాఖ్యలు నిర్లక్ష్యంగా ఉన్నాయని.. దేవుడు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడాలని ట్వీట్ చేశారు. ప్రతిసారి కరోనా వైరస్ కేవలం జ్వరం మాత్రమే అని చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడగలమన్నారు చంద్రబాబు. ఇదంతా ఆయన నిర్లక్ష్యానికి నిదర్శమని.. వైరస్ కేసుల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ టాప్‌లో ఉందన్నారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అమాయకుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందన్నారు. దేవుడు ఏపీని కాపాడాలన్నారు టీడీపీ అధినేత. జగన్ మాట్లాడిన వీడియోను బాబు ట్వీట్ చేశారు. Read Also: Also Read: ముఖ్యమంత్రి జగన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపొద్దని కోరారు.. కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదబోదని.. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ సోకితే అంటరానితనం.. ఒక భయంకరమైన రోగమనే భావనను అందరూ బుర్రల్లో నుంచి తీసేయాలన్నారు. కరోనా వైరస్ జ్వరంలాంటిదేనని, ఎవరికైనా రావొచ్చని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రేపు పొద్దున తనకైనా కరోనా రావొచ్చన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుందన్నారు జగన్. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా స్వచ్ఛందంగా 104, 108 ద్వారా వైద్యులకు సమాచారమిస్తే చికిత్స అందించి వెళ్తారన్నారు. ఎవరికి వారే దీన్ని కట్టడి చేసుకోవాలని.. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంచుకోగలిగితే అదే కరోనాకు పరిష్కారమని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు జగన్‌ను టార్గెట్ చేశారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3aMwtCi

Comments