పామూరు ఎస్సైపై సంచలన ఆరోపణలు చేసిన తారా చౌదరిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్సైను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు ఆమెతో పాటూ భర్త రాజ్‌కుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారంపై పామూరు సీఐ ఏఎస్ రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పామూరులో ఉంటున్న .. స్థానిక ఎస్పై చంద్రశేఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అకారణంగా తన భర్తను కొట్టి.. అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన కుమారుడు మందులు, నిత్యావసరాలు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను ఎస్సై కొట్టారని.. నాటుసారా తాగాడని, అక్రమ రవాణా చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన భర్తకు బ్రీత్ ఎనలైజ్ టెస్టులు నిర్వహించారన్నారు. ఎస్సై చంద్రశేఖర్ ఉద్దేశకపూర్వకంగానే తన భర్తను టార్గెట్ చేశారని.. 20 రోజుల క్రితం ట్రాన్స్‌ఫర్ అయ్యారని.. ఆయన పామూరులో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు తారా చౌదరి. తాను లాక్‌డౌన్ సమయంలో ప్రజల సమస్యల్ని ఎస్సైకు వివరించామని.. ఆ కోపంతోనే తన భర్తను టార్గెట్ చేశారని తారా చౌదరి ఆరోపించారు. తన భర్త ఒంటిపై గాయాలను మీడియాకు చూయించారు. అయితే ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2yWnEbG
Comments
Post a Comment