విజయవాడలో నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా

ఏపీలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మకులతో పాటు.. జగన్ సర్కార్ కొత్తగా నియమించిన వార్డు వాలంటీర్లు కూడా కరోనా విధుల్లో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. అదే విధంగా వారికి అవసరం అయిన రేషన్లు, ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో పాటు, వృద్దులకు పెన్షన్లు వంటివి అందిస్తున్నారు. అయితే ఇదే సమయంలో వార్డు వాలంటీర్లు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడలో నలుగురు వార్డు సోకింది. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌కు తరలించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. అయితే వారికి కరోనా సోకినట్లు తేలింది. ఇక విజయవాడలో కరోనా విధుల్లో ఉన్న ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వైరస్‌ బారిన పడ్డారు. కొద్దిరోజులుగా ఇన్‌స్పెక్టర్ రెడ్‌జోన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే తాజాగా మరో ఆరుగురికి పాజిటివ్‌ రాగా వారిలో నలుగురు వార్డు వలంటీర్లు కూడా ఉన్నారు. మరోవైపు విజయవాడలో కూడా పెరుగుతున్న పాజిటివ్ కేసులు అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగుతున్నటువంటి ఏరియాలో కృష్ణాజిల్లా ముఖ్యంగా ఒకటి. అయితే విజయవాడలో అంతగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే అక్కడ అసెంప్టమాటిక్ కేసులు ఎక్కువవుతున్నాయి అని చెబుతున్నారు స్థానికులు. ఇప్పటికే విజయవాడలో రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. తాజాగో పోలీసులు ఆయా ప్రాంతాల్లో రక్షక్ వాహనాలతో పోలీసులు మార్చ్ ఫాస్ట్ చేపట్టారు. అయితే అధికారులు మాత్రం ప్రజలు సరిగా లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. స్వయంగా అక్కడి కలెక్టర్ ఇంతియాజ్ ఈ మాటలు అన్నారు. అందుకే విజయవాడలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అంతేకాకుండా కూరగాయలు సహా మిగతా ఇతర అత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి పెద్దపెద్ద ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేశారు అధికారులు. కానీ అక్కడ ప్రజలకు కొంత సమయం ఇవ్వడం కారణంగా ఎలాంటి సామాజిక దూరం పాటించడంలేదు దీంతో ఈ విధంగా కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2KLDhpb

Comments