నడిరోడ్డుపై జగన్ బొమ్మ.. మండిపడ్డ మాజీ డిప్యూటీ సీఎం

సీఎం జగన్ తీరుపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కరోనా వేళ కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు ఆగడం లేదు. ప్రెస్ మీట్లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఏ చిన్న అవకాశం లభించిన అధికార పార్టీపై విమర్శల దాడి చేస్తున్నారు. అటు అధికార పార్టీ కూడా అదే స్టైల్‌లో దూసుకుపోతుంది. ఓ వైపు కరోనా కట్టడికి పనిచేస్తూనే... ఇటు విపక్షాలు చేస్తున్నవిమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. నడిరోడ్డుపై జగన్ బొమ్మ గీసిన కొందరి ఫోటో తీసి ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీ వాళ్లు చేస్తున్న ఇలాంటి పనులు సిగ్గుచేటన్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నవారిని పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి చేసిన ఈ ఆరోపణలపై పలువురు నెటిజన్స్ మద్దతు పలికారు. వైసీపీ వాళ్లపై విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రలు కోవిడ్ బొమ్మలు గీసి అవగాహన కల్పిస్తుంటే... ఏపీలో మాత్రం జగన్ బొమ్మలు గీస్తున్నారంటూ ఎగతాళి కూడా చేశారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం ఈ ఫోటో ఇప్పటిదేనన్న గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రోజురోజకు పెరిగిపోతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 1097కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది మరణించారు. ఆదివారం ఒక్క రోజు ఏపీలో 81 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీ రాజ్‌భవన్‌కు కూడా కరోనా వ్యాపించింది. అక్కడ పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో నలుగురు డాక్టర్లే కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3bC4si2

Comments