వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనా విస్తరిస్తున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారని.. వారిని అడ్డుకోవాలని లాయర్ కిషోర్ పిల్‌లో కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వైఎస్సార్‌సీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరడం విశేషం. ఈ పిల్‌లో ప్రతివాదులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, , చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను చేర్చాలని కోరారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న అమలులో ఉన్న సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన నేతలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని ఆక్షేపిస్తూ లాయర్ కిషోర్ ఈ పిల్ దాఖలు చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితంకావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయని.. అయినా కొందరు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన అంటున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారని.. సామాజిక దూరం పాటించలేదని ఆరోపణలు వినిపించాయి. ఎమ్మెల్యేలు ర్యాలీలు నిర్వహించిన ఒకటి రెండు నియోజకవర్గాల్లో కరోనా కేసులు పెరగాయని ప్రతిపక్షం టీడీపీ కూడా ఆరోపించింది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3aUhkiv
Comments
Post a Comment