ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. , మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలో రానున్న నాలుగు రోజులపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరంలో పిడుగులు పడే అవకాశం ఉందని, కోస్తాకు తుపాను గండం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. కోస్తా తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర అండమాన్ నికోబార్ దీవుల్లో మరో తుఫాన్ చెలరేగనున్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. విశాఖపట్టణం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఆ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వానలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 30న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది మరింత తీవ్రంగా మారుతుందన్నారు. వచ్చే మూడు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు కూడా 43 డిగ్రీలకు వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే 48 గంటల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు రాయలసీమలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా అక్కడక్కడా వానలు పడుతున్నాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3cNyUG8
Comments
Post a Comment