ఏపీ ప్రజలకు అలర్ట్.. మీ ఏరియాలో కరెంట్ పోతే ఫోన్ చేయండి

ఏపీలో విద్యుత్ అంతరాయాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. సమస్యలన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ శాఖకు సంబంధించి అందుతున్న ఫిర్యాదులపై సమీక్ష చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్ విషయంలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే 1912 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.. ఒకవేళ సమస్య వస్తే ఎన్ని గంటల్లో పరిష్కరించారనే విషయం నమోదవుతుంది. ప్రజలు ఫోన్, విద్యుత్‌ శాఖ వెబ్‌ సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల దగ్గర స్పెషల్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు. ఎక్కడా విద్యుత్‌ అంతరాయం లేకుండా చూస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యుత్‌ శాఖ అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఈదురు గాలులు, వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో అదనంగా పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేశారు అధికారులు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2S9KO58

Comments