మెరిసిపోతోంది. పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ రోజు కూడా పసిడి ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గినా కూడా మన దేశంలో బంగారం ధర పైకి కదలడం గమనార్హం. మరోవైపు బంగారం ధర పెరిగితే మాత్రం భిన్నమైన దారిలో నడిచింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.970 పెరుగుదలతో రూ.46,900కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా రూ.2120 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.44,740కు ఎగసింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.42,200కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించింది. దీంతో ఔన్స్‌కు 1723.20 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.51 శాతం పెరుగుదలతో 15.28 డాలర్లకు ఎగసింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2030 పెరుగుదలతో రూ.45,150కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1620 పెరుగుదలతో రూ.47,650కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర మాత్రం రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.42,200కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3cRYidR
Comments
Post a Comment