పెట్రోల్‌, డీజిల్ ధరల భారీ తగ్గింపు.. లీటరుకు రూ.27 వరకు కోత!

క్రూడ్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా దిగొచ్చాయి. అది కూడా భారీ స్థాయిలో. దేశీ ఇంధన ధరలు లీటరుకు ఏకంగా రూ.30 మేర క్షీణించనున్నాయి. అయితే ఇది మన దేశంలో కాదు. పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్‌లో. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. లీటరు రూ.15 తగ్గుదలతో రూ.96.58 నుంచి రూ.81.58కు తగ్గింది. హైస్పీడ్ రూ.27.15 తగ్గుదలతో రూ.107.25 నుంచి రూ.80.10కు, కిరోసిన్ ధర రూ.30 తగ్గుదలతో రూ.77.45 నుంచి రూ.47.44కు, లైట్ డీజిల్ ఆయిల్ ధర రూ.15 తగ్గుదలతో రూ.62.51 నుంచి రూ.47.51కు దిగొచ్చాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. Also Read: ఇక మన దేశంలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. దేశీ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. Also Read: అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.69.59 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.62.29 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.75.30 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.64 శాతం పెరుగుదలతో 26.85 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 3.61 శాతం పెరుగుదలతో 19.52 డాలర్లకు ఎగసింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2xryhmI

Comments