SBI అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక చౌక వడ్డీకే రుణాలు!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్), ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటుతో (ఈబీఆర్) అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేట్ల గణనీయంగా దిగిరానున్నాయి. అంతేకాకుండా హోమ్ లోన్ తీసుకున్న వారికి (ఆర్ఎల్ఎల్ఆర్, ఈబీఆర్ లింకైన) ఈఎంఐ భారం తగ్గనుంది. 30 ఏళ్ల కాలపరిమితిలోని రునాలపై రూ.లక్షపై రూ.52 వరకు ఈఎంఐ దిగివస్తుంది. ఎస్‌బీఐ ఈబీఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రేట్లు 75 బేసిస్ పాయింట్ల తగ్గుదలతో వరుసగా 6.65 శాతానికి, 7.4 శాతానికి తగ్గాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తుంది. Also Read: అలాగే ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లను కూడా తగ్గించేసింది. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచే ప్రారంభమౌతున్నాయి. ఇది వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ఆరంభమయ్యేది. కాగా స్టేట్ బ్యాంక్ చివరిగా మార్చి 10న ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించేసింది. Also Read: ఇప్పుడు ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ లభిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. Also Read: అలాగే 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు 5 శాతంగానే ఉంది. ఇక ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 5.7 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా 5.7 శాతం వడ్డీనే వస్తుంది. 3 ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై కూడా ఇదే వడ్డీ రేటును పొందొచ్చు. చివరిగా ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలకు కూడా ఇదే వడ్డీ వస్తుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ లభిస్తుంది. కాగా స్టేట్ బ్యాంక్ కూడా ఆర్‌బీఐ దారిలోనే నడుస్తోంది. ఆర్‌బీఐ రుణ ఈఎంఐ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కూడా లోన్ ఈఎంఐలపై మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమేటిక్‌గానే ఈ బెనిఫిట్ కస్టమర్లకు అందుతుందని పేర్కొంది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2wI5gmm

Comments