SBIలో డబ్బు డిపాజిట్ చేస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమరలకు అదిరిపోయే ఝలక్ ఇచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో ఎస్‌బీఐ కూడా ఇదే దారిలో నడిచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించింది. మార్చి 28 నుంచి రేట్ల కోత నిర్ణయం అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఎస్‌బీఐ తాజా ఎఫ్‌డీ రేట్ల కోత తర్వాత ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచే ప్రారంభమౌతున్నాయి. ఇది వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ఆరంభమయ్యేది. కాగా స్టేట్ బ్యాంక్ చివరిగా మార్చి 10న ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించేసింది. Also Read: ఇప్పుడు ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ లభిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. Also Read: అలాగే 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు 5 శాతంగానే ఉంది. ఇక ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 5.7 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా 5.7 శాతం వడ్డీనే వస్తుంది. 3 ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై కూడా ఇదే వడ్డీ రేటును పొందొచ్చు. చివరిగా ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలకు కూడా ఇదే వడ్డీ వస్తుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ లభిస్తుంది. కాగా స్టేట్ బ్యాంక్ కూడా ఆర్‌బీఐ దారిలోనే నడుస్తోంది. ఆర్‌బీఐ రుణ ఈఎంఐ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కూడా లోన్ ఈఎంఐలపై మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమేటిక్‌గానే ఈ బెనిఫిట్ కస్టమర్లకు అందుతుందని పేర్కొంది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2UIZyIH

Comments