పసిడి వెలవెలబోతోంది. మళ్లీ తగ్గింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి రెండు రోజులుగా తగ్గుతూనే వస్తోంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలోనూ పసిడిపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే కూడా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పతనమైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.215 తగ్గుదలతో రూ.43,170కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.39,520కు క్షీణించింది. Also Read: పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర కేవలం రూ.10 తగ్గింది. దీంతో వెండి ధర రూ.39,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. 1639 డాలర్ల వద్ద కదలాడుతోంది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1640.35 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.48 శాతం తగ్గుదలతో 14.19 డాలర్లకు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.41,020కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.420 క్షీణతతో రూ.43,300కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.10 తగ్గుదలతో రూ.39,500కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2wOeBcj
Comments
Post a Comment