కరోనా భయం ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఇటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్లకు కూడా ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని సూచిస్తున్నారు. అయినా సరే జనాలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు.. కూరగాయల మార్కెట్ల దగ్గర సామాజిక దూరం పాటించుకుండా గుంపులుగా తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే ఇళ్లకే నేరుగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఆయనే స్వయంగా ఇంటింటికి తిరిగారు. లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని.. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కోరారు. నిత్యావసరాలు, కూరగాయలను ప్రభుత్వం నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాంటప్పుడే జనాలు ఇళ్లలో నుంచి బయటకు రారన్నారు. మరోవైపు అన్ని పట్టణాల్లో సరుకులు ఇళ్లకు హోం డెలివరీ సౌకర్యం ఉందని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. నిమ్మల రామానాయుడు కూరగాయలు మాత్రమే కాదు.. ఆయనే స్వయంగా మున్సిపల్ కార్మికులతో కలిసి శానిటేషన్‌లో పాల్గొన్నారు. ఆయన కెమికల్స్, బ్లీచింగ్ చల్లుతున్నారు. మున్సిపల్ సిబ్బందిలో ధైర్యం నింపేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అక్కడక్కడా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా శానిటైజేషన్‌లో ఇలా భాగస్వామ్యం అవుతున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2WRYZiK
Comments
Post a Comment