తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ సమావేశాలు కలకలంరేపుతున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 2వేలమందికిపైగా హస్తినకు వెళ్లినట్లు తేలింది. వారిలో ఎక్కువమందికి కరోనా పాజిటివ్ తేలింది.. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోయారు. అలాగే మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలను ఆరా తీస్తున్న అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అంజాద్ బాషా కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని సోషల్ మీడియాతో పాటూ మరికొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్పందించారు.. క్లారిటీ ఇచ్చారు. తాను ఢిల్లీ వెళ్లాలని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఎల్లో మీడియా తనపై కుట్ర చేసిందని.. మార్చి 2న ఢిల్లీకి వెళ్లానని చెప్పుకొచ్చారు. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు లాయర్లను కలిశానని.. మర్కజ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశానని క్లారిటీ ఇచ్చారు. మార్చి 3న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చానని.. 4న కేబినెట్ సమావేశంలో పాల్గొన్నానని.. 5 నుంచికడపలోనే ఉన్నానని తెలిపారు. కరోనా, లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. తాను డిప్యూటీ సీఎం కాబట్టి ప్రోటోకాల్ ఉంటుందని గుర్తు చేశారు.. తాను ఎక్కడికి వెళ్లినా పక్కా సమాచారం ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్‌ను, తనను ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా పన్నిన కుట్ర అన్నారు. అందుకే తాను చట్టపరంగా క్రిమినల్ కేసు పెట్టడంతో పాటూ పరువు నష్టం దావా వేస్తాను అన్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/39CkGWt
Comments
Post a Comment