తెలంగాణ రాష్ట్రంలో కరోనా వణికిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించినా..కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం వరకు 59 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాపై ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. వైరస్ అడ్డుకట్ట వేయాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు. సామాజిక దూరం ఒక్కటే మనల్ని ఈ వైరస్ నుంచి కాపాడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంటి నుంచి అనవసరంగా బయటకు వస్తే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోవాలని సూచిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో కరోనా బాధితులున్న ప్రాంతాలను 'కొవిడ్ - 19 క్వారంటైన్డ్ జోన్'గా ప్రకటించింది ప్రభుత్వం. ఈ ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్లల్లోని బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అలాంటి జోన్లలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు ఇంటి వద్దకే అధికారులు పంపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజాల్, కొత్త పేట ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా బాధితులు నివాసం ఉండే కాలనీలోని కిలో మీటర్ పరిధిలో రోడ్ జోన్ గా ప్రకటించారు. అక్కడున్న వారు ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదన్నారు. క్వారంటైన్ లో ఉండే అన్నీ రోజులు వీరికి ఇంటి వద్దకే రేషన్, ఇతరత్రా సామాగ్రీని అందచేయడం జరుగుతుందని అంటున్నారు. వీరికి మందులు, ఇతరత్రా అవసరాల కోసం స్థానికంగా ఉన్న సిబ్బందిని ఏర్పాటు చేశారు. కిలో మీటర్ పరిధిలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేసి..అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాప్తి చెందదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది అనుమానితుల్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితులు ఎక్కువైతే.. కష్టంగా మారుతుందని. అనుమానితుల్ని ఇంటివద్దే క్వారంటైన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2WQJUh5
Comments
Post a Comment