కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన కొందరు క్వారంటైన్‌లో ఉంటున్నారు. కొంతమంది హోం క్వారంటైన్‌లో వైద్యుల్య పర్యవేక్షణ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చిన కొందరు మాత్రం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో అదే జరిగింది. ఓ నర్సు తన భర్త విదేశాలకు వెళ్లినా దాచి ఉంచారు. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఆ నర్సు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తోంది. ఆమె భర్త ఈ నెల విదేశీ పర్యటన నుంచి మచిలీపట్నం వచ్చాడు. తన భర్త సమాచారాన్ని ఆమె గోప్యంగా ఉంచింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉందని తెలిసినా ఆ సమాచారాన్ని నర్సు అధికారులకు తెలియజేయలేదు. విషయం బయటపడటంతో.. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వ్యక్తి మచిలీపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో అతడు ఎవరెవరిని కలిశాడో అధికారులు ఆరా తీస్తున్నారు. అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కృష్ణాజిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2QTccEe
Comments
Post a Comment