కళ్ల ముందు కన్నతల్లి ఉన్నా.. కడసారి చూడలేక.. ఒంగోలులో కన్నీటి విషాదం

కరోనా మహమ్మారి తల్లీకొడుకులకు పెద్ద కష్టాన్నే తెచ్చి పెట్టింది. కన్నతల్లి కళ్లముందు ఉన్నా.. కడసారి చూడలేని నిస్సహాయ పరిస్థితి ఆ కుమారుడికి ఎదురైంది. ఇంట్లో నుంచి బయటకు రాలేని స్థితిలో.. చివరికి తల్లి అంత్యక్రియల్ని కూడా వీడియో కాల్‌ ద్వారాలో చూడాల్సి వచ్చింది. ఒంగోలులో జరిగిన ఈ ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒంగోలుకు చెందిన యువకుడు ఇటీవలే అమెరికా నుంచి వచ్చాడు. దీంతో అతడు ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించి హౌస్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఈలోపే తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చనిపోయింది. ఆదివారం ఉదయం ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు తరలించారు. అంత్యక్రియలు కూడా అదే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కన్నతల్లి ఇంట్లో కనుచూపు మేరలో ఉన్నా ఆమెను కడసారి చూడలేని పరిస్థితి కుమారుడికి ఎదురైంది. హోం క్వారంటైన్‌లో ఉండటంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాడు. .. కడసారి చూపునకు కూడా నోచుకోలేక కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. చివరికి వీడియోకాల్‌ ద్వారా అంతిమ సంస్కారాలను చూడాల్సి వచ్చింది. ఈ యువకుడు ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తూ.. కన్నతల్లి అంత్యక్రియలకు దూరంగా ఉన్నాడు. అంతేకాదు సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలను బంధువులు పూర్తి చేశారు. పాపం కన్నతల్లిని చివరిసారిగా చూడలేకపోయానన్న బాధను దిగమింగి.. సమాజం కోసం కరోనా కట్టడి కోసం తనవంతుగా ఇంటికి పరిమితమై శభాష్ అనిపించుకున్నాడు. స్థానికులతో పాటూ ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అతడ్ని అభినందిస్తున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3bBCdzH

Comments