పసిడి పరుగు కొనసాగుతూనే ఉంది. భారీగా పెరుగుతూ వస్తోంది. పసిడి ధర ఈ వారం రోజుల్లో భారీగా పెరిగింది. మళ్లీ ఆకాశాన్ని అంటింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మళ్లీ చుక్కలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడం ఇందుకు ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో గత వారంలో (మార్చి 20 నుంచి 27 వరకు) బంగారం ధర ర్యాలీ చేసింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2630 పెరుగుదలతో రూ.45,300కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.2680 పెరుగుదలతో రూ.41,770కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. కూడా ఇదే దారిలో నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్థాయిలో మాత్రం పెరగలేదు. కేజీ వెండి ధర గత వారం రోజుల్లో రూ.900 ర్యాలీ చేసింది. దీంతో వెండి ధర రూ.41,410కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర గత వారం రోజుల్లో తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 1675 డాలర్ల నుంచి 1630 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం దాదాపు నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు. వెండి ధర ఔన్స్‌కు 14.61 డాలర్ల వద్దనే కొనసాగుతూ వచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2QSgtHE
Comments
Post a Comment