ఏపీలో పదో తరగతి విద్యార్థుల్ని ఇంటర్‌కు ప్రమోట్ చేయాలనే కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. కరోనా విస్తృతి దృష్ట్యా ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని కోరారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థులను ప్రమోట్ చేయాలన్నారు. మరోవైపు స్కూల్ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతికి ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే హాజరును బట్టి పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో జగన్ సర్కార్ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే ఏపీపీఎస్సీతో పాటూ మరికొన్ని పరీక్షలు వాయిదా వేశారు. తాజాగా స్కూల్ విద్యార్థులకు విద్యా సంవత్సరం చివర్లో నిర్వహించే పరీక్షలు జరిపే అవకాశం లేకపోవడంతో.. పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Uq8fIY
Comments
Post a Comment