ఏపీకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. మూడు నెలల కోసం ఎంతో తెలుసా!

ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపుతూ రాజ్ భవన్ కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల ప్రభుత్వ ఖర్చుల కోసం రూ.70994,98,38,000 విలువైన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌కు ఆర్డినెన్స్ తెచ్చారు. బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. జూన్ 30 వరకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. Read Also: వాస్తవానికి ఈ నెల 31లోపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 31లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి.. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.. కేబినెట్‌లో ఓకే చెప్పారు. Also Read: ఆర్డినెన్స్ నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు.. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటూ భద్రతా సిబ్బంది, వారి సహాయకులు.. అధికారులు, వారి సహాయకులు, అసెంబ్లీ సిబ్బంది అసెంబ్లీకి వస్తారు. ఇది అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించింది. అందుకే ఆర్డినెన్స్‌ ఉత్తమమైన మార్గం కాబట్టి.. ఈ మూడు నెలల కోసం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/39t5smA

Comments