మాత్రం పరుగులు పెడుతూనే వస్తోంది. పసిడి ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మళ్లీ చుక్కలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా మన దేశంలో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టడం గమనార్హం. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 8వ రోజు కావడం గమనార్హం. ఇకపోతే మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.490 పెరుగుదలతో రూ.45,300కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.510 పెరుగుదలతో రూ.41,770కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.90 తగ్గింది. దీంతో వెండి ధర రూ.41,410కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 1630 డాలర్ల సమీపంలోకి చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 1.25 శాతం తగ్గుదలతో 1630.60 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 శాతం తగ్గుదలతో 14.61 డాలర్లకు దిగొచ్చింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.510 పెరుగుదలతో రూ.42,560కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1950 పెరుగుదలతో రూ.45,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.90 తగ్గుదలతో రూ.41,410కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Jxuerz
Comments
Post a Comment