కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో 21 రోజులు లాక్‌డౌన్ విధించడంతో.. క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. చతేశ్వర్ పుజారా గార్డెన్‌లో మొక్కలు పెంచడంలో బిజీగా కనిపిస్తుండగా.. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ మెరుగుపర్చుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం కోహ్లీకి ఇంట్లోనే అతని భార్య అనుష్క శర్మ హెయిర్‌కట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఇంట్లో తన అన్న కృనాల్ పాండ్య, వదినతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వీడియోని కృనాల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాండ్యా బ్రదర్స్ సుదీర్ఘకాలంగా ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. Read More: దేశంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి తాము ఇంట్లోనే ఉన్నాము.. మీరు కూడా ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ కట్టడికి సహకరించండి అని పాండ్యా బ్రదర్స్ కోరుతున్నారు. తాజాగా టెన్నిస్ బాల్‌తో ఈ బ్రదర్స్ క్రికెట్ ఆడగా.. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసి కృనాల్ వికెట్‌ని కూడా పడగొట్టాడు. గత ఏడాది వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడింది లేదు. మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌కి హార్దిక్ ఎంపికయ్యాడు. కానీ.. సిరీస్ అర్ధాంతరంగా రద్దవడంతో అతనికి నిరాశే ఎదురైంది. Read More: ముంబయిలో ఇటీవల జరిగిన డీవై పాటిల్ టీ20 కప్‌లో బ్యాక్ టు బ్యాక్ శతకాలు బాదిన హార్దిక్ పాండ్య.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎలా రాణిస్తాడో..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. ఐపీఎల్ 2020 సీజన్‌ని రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3bxW7eT
Comments
Post a Comment