నేను చనిపోలేదు, ఆ ఆంటీని వలవేసి పట్టుకోలేదు.. కరోనా సోకిన డీఎస్పీ కుమారుడి వీడియో వైరల్

కరోనా పాజిటివ్‌గా తేలిన కొత్త గూడెం డీఎస్పీ కుమారుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై, తన కుటుంబంపై వస్తున్న వదంతులు వస్తున్నాయని, అవన్నీ అసత్యాలు, పుకార్లేనని డీఎస్పీ కుమారుడు స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన తాను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వార్తలు వస్తు్న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తమ ఇంట్లో పని చేసే ఆంటీని కూడా పోలీసులు వల వేసి పట్టుకున్నారని అంతా తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి అసత్య వార్తల వల్ల తనలోనే కాకుండా తన కుటుంబంలో, బంధువర్గంలో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటోందని, అందరూ కంగారు పడుతున్నారని వీడియోలో మాట్లాడారు. దయ చేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని అందరికి విజ్ఞప్తి చేశారు. గాంధీ వైద్యులు చికిత్స బాగా అందిస్తున్నారని చెప్పారు. తనతో పాటు, తన తండ్రి డీఎస్పీ అలీ, తమ ఇంట్లో పని చేసే మహిళ కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. Must Read: ‘‘మీడియా వారికి నా హృదయపూర్వక విజ్ఞప్తి. గారి అబ్బాయిని. ఈ రోజు మధ్యాహ్నం నేను చనిపోయినానని మా ఇంటిలో పనిచేసే ఆంటీని పోలీసులు వలవేసి పట్టుకున్నారని ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. మా నాన్నగారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కానీ, ఆకతాయితనంతో గాని పుకార్లను సృష్టించి అందరికీ పంపిస్తున్నారు. అందుకే నేను స్పష్టత ఇస్తున్నా. నేను బతికే ఉన్నాను. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరుతున్నాను. ఇబ్బందికరమైనా గాని నేనే స్వయంగా వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రస్తుతం నేను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో కరోనా చికిత్స తీసుకుంటున్నాను.’’ అని ఓ వీడియోను విడుదల చేశారు. Also Read: Also Read:


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2JkdAez

Comments