కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టడికి తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత కారణాల రీత్యా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీపై దృష్టి పెట్టింది. ఆ ప్రాంతంలో రెండు కుటుంబాల వారికి, మరో ప్రాంతంలో ఓ కుటుంబానికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు చెందిన వారు ఎక్కడెక్కడ సంచరించారు? ఎవరెవరిని కలిశారు అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. వారు దాదాపు 400 మందిని కలిసినట్లుగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వారి వద్దకు వెళ్లి వైద్య ఆరోగ్య శాఖతో కలిసి వారిని హోం క్వారంటైన్ చేస్తున్నారు. Also Read: నిజాం ప్రభుత్వ హయాంలో దిల్లీలో నిర్మించిన ఓ ప్రార్థనా మందిరానికి ఈ కుటుంబాల వారు వెళ్లి వచ్చిన అనంతరం వారికి కరోనా సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెలింగ్ మధ్యవర్తిని అధికారులు అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నారు. అయితే, నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ నెల 10న ఆ ప్రార్థన మందిరానికి వెళ్లి రావడం గమనార్హం. ఆయన 17న ఇక్కడికి తిరిగిరాగా కరోనా పాజిటివ్‌గా తేలింది. Also Read: ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పాతనగరంలో కరోనా విస్తరించకుండా చూసేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక, మంత్రులు కేటీఆర్, ఈటల ఓల్డ్ సిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీరు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో మాట్లాడారు. పాతనగరంలో కరోనా కట్టడికి వారు కూడా చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/33V6IOk
Comments
Post a Comment