సీజన్‌ని రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో ఇప్పుడు రద్దు మినహా మరో ప్రత్యామ్నాయం బీసీసీఐ ముందు కనిపించడం లేదు. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,139కి చేరగా.. 27 మంది చనిపోయారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఐపీఎల్ రద్దుపై బీసీసీఐ త్వరలోనే ఓ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. Read More: వాస్తవానికి ఏప్రిల్ రెండో వారంలో ఒకసారి దేశంలో పరిస్థితిని సమీక్షించి ఐపీఎల్ 2020 నిర్ణహణపై తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ యోచించింది. కానీ.. దేశంలో ప్రస్తుతం 21 రోజుల లాక్‌డౌన్ ఉండగా.. అది ఏప్రిల్ 14 వరకూ కొనసాగనుంది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతుండటంతో.. ఆ లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలూ కనిపిస్తున్నాయి. మరోవైపు పర్యాటక వీసాల్ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకూ రద్దు చేయడంతో.. విదేశీ క్రికెటర్లు అప్పటిలోపు భారత్ గడ్డపైకి వచ్చే అవకాశం లేదు. Read More: ఒకవేళ ఏప్రిల్ 15 తర్వాత సాహసోపేతంగా టోర్నీని నిర్వహించినా.. స్టేడియంలో సామాజిక దూరం పాటించడం అసాధ్యం. కాబట్టి.. ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. ఇక విదేశీ క్రికెటర్లు లేకుండా టోర్నీ నిర్వహించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఒప్పుకోవడం లేదు. మొత్తంగా.. ఇన్ని అవాంతరాల మధ్య టోర్నీని నిర్వహించడం కంటే ఈ ఏడాది ఐపీఎల్‌ని రద్దు చేయడమే మంచిదని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Jp0soB
Comments
Post a Comment