దేశంలో మహమ్మారి క్రమంగా కోరలు చాస్తోంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలు రేపిన ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి. నిజాముద్దీన్ మర్కజ్ పరిణామాలతో ఒక్కసారిగా దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడమే కాదు.. అన్ని శాఖలను కుదిపేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మర్కజ్ ఘటనతో ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణలో సోమవారం వెలుగుచూసిన తర్వాత కేంద్రం మరింత అప్రమత్తమయ్యింది. దేశంలో కరోనా వైరస్ మరో దశలోకి ప్రవేశించిన సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మంగళవారం నమోదయిన కేసులే దీనికి నిదర్శనం. మంగళవారం అత్యధికంగా 300పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నమోదుకావడం ఇదే తొలిసారి. మర్కజ్ ప్రార్థనలకు హాజరైనవారిలో 303 మందికి వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. మంగళవారం నమోదైన కేసుల్లో వీరే అధికంగా ఉన్నారు. అలాగే ఈ ప్రార్థనలకు హాజరైనవారిలో 10 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1618కి చేరుకోగా, ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 150 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడులోనే ఏకంగా 159 కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం మహారాష్ట్ర 82, తమిళనాడు 57, ఢిల్లీ 23, మధ్యప్రదేశ్ 19, కేరళ 20, తెలంగాణ 20, ఆంధ్రప్రదేశ్ 21, పశ్చిమ్ బెంగాల్ 15, ఉత్తరప్రదేశ్ 7, జమ్మూ కశ్మీర్ 6, గుజరాత్ 6 కాగా, దేశవ్యాప్తంగా మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన మూడు రోజుల్లో దేశంలో కొత్తగా 650 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 100కు చేరువైంది. ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్‌కు వెళ్లి తిరిగొచ్చివారికి కరోనా వైరస్ సోకినట్టు తొలుత తెలంగాణలోనే వెలుగుచూసింది. మంగళవారం కొత్తగా మరో 15 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించిందిరు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 97కి చేరుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే కరోనా సోకిన 13 మందికోలుకుని ఇళ్లకు వెళ్లినట్టు తెలిపారు. మార్చి 27న అత్యధికంగా 14 కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది. తాజా బాధితులందరూ ఇటీవల దిల్లీలో మత కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులేనని వైద్యవర్గాలు తెలిపాయి. దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 1030 మంది వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఇప్పటివరకూ 35 మందిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మిగిలినవారిలో ఎందరిలో కరోనా లక్షణాలున్నాయి, వీరు ఎంతమందిని కలిశారనేది ప్రాధాన్యాంశాలుగా మారాయి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మంగళవారం ఉదయం వరకు కేవలం 23 కేసులే ఉండగా.. మహమ్మారి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. 24 గంటల్లోనే కొత్తగా 21 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 12 మంది ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని వచ్చినవారే. వీరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 14 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కలెక్టర్ ధ్రువీకరించినా, ప్రకటన చేయలేదు. ఈ 14 ప్రకటిస్తే ఏపీలో కోవిడ్ కేసులు 58కి చేరుతాయి. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 53 మృతిచెందగా.. అత్యధికంలో మహారాష్ట్రంలో 11 మంది, తెలంగాణ 8, గుజరాత్ 6, పశ్చిమ్ బెంగాల్ 5, మధ్యప్రదేశ్ 5, పంజాబ్ 4, కేరళ 2, ఢిల్లీ 2, కర్ణాటక 3, తమిళనాడు 2, జమ్మూ కశ్మీర్ 2, మిగతా చోట్ల ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దాదాపు 150 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో 302, కేరళలో 241, ఢిల్లీలో 120, ఉత్తరప్రదేశ్‌లో 104, కర్ణాటకలో 101, తమిళనాడు 124, తెలంగాణ 97, రాజస్థాన్ 93, జమ్మూ కశ్మీర్‌లో 55, గుజరాత్ 74, ఆంధ్రప్రదేశ్ 58, హర్యానా 43, మధ్యప్రాదేశ్ 66, పంజాబ్ 41, బిహార్ 21, పశ్చిమ్ బెంగాల్ 27, చండీగఢ్ 15, లడఖ్ 13, అండమాన్ నికోబార్ దీవులు 10, చత్తీస్‌గఢ్ 9, ఉత్తరాఖండ్ 7, గోవా 5, ఒడిశా 4, హిమాచల్‌ప్రదేశ్ 3, అసోం, జార్ఖండ్, మిజోరాం, పుదుచ్చేరి, మణిపూర్‌లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2R21LOC
Comments
Post a Comment