ఏపీలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులు నమోదుకాగా.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వాట్సాప్ ద్వారా తెలిపారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 58కి చేరినట్లైంది. Read Also: ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. వైద్యపరీక్షల్లో 14 పాజిటివ్, 10 నెగిటివ్, ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందంటున్నారు అధికారులు. అయితే ఈ కరోనా పాజిటివ్ కేసులను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ధ్రువీకరించాల్సి ఉంది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత నాలుగు కొత్త కొవిడ్-19 పోజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నాలుగు కేసులు విశాఖపట్నం నగరంలోనే నమోదైనట్లు తెలిపారు. వీరందరూ ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నట్లు తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అధిక శాతం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారే ఎక్కువమంది ఉన్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3aKfstv
Comments
Post a Comment