న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7: 11 బంతుల్లో 1x4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (54: 64 బంతుల్లో 8x4, 1x6) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ బాదినప్పటికీ కీలక సమయంలో ఔటైపోయాడు. దీంతో.. లంచ్ విరామానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85/2తో నిలిచింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (15 బ్యాటింగ్: 49 బంతుల్లో 2x4), విరాట్ కోహ్లీ (3 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. ఇటీవల ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియాకి మెరుగైన ఆరంభాలివ్వలేకపోయిన భారత ఓపెనర్లు.. ఈరోజు కూడా తొలి వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యమే నెలకొల్పారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. భారత ఇన్నింగ్స్ ఆరంభించిన పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ కాసేపు సహనంతో క్రీజులో నిలిచి ఆ తర్వాత కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లోనే పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. మయాంక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి నిలకడగా ఆడిన పృథ్వీ షా.. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. రెండు రోజుల క్రితం గాయపడిన ఈ యువ ఓపెనర్ అనూహ్యంగా ఫిట్‌నెస్ సాధించి ఎట్టకేలకి ఫామ్ అందుకున్నాడు. కానీ.. భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. జెమీషన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడి లాథమ్‌కి క్యాచ్ ఇచ్చేశాడు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2wWYusJ
Comments
Post a Comment