Live: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రానికల్లా 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎస్ఈసీ నాగిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి 2,925 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, కాంగ్రెస్ నుంచి 2,619.. బీజేపీ నుంచి 2,321 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ తరపున 347 మంది, ఏఐఎంఐఎం నుంచి 297 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సీపీఐ నుంచి 180, సీపీఎం నుంచి 165, ఇతర పార్టీల వారు 284, స్వతంత్రులు 3,760 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 9 కార్పొరేషన్లలో 325 వార్డులు ఉండగా, వీటిలో ఒకటి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవం అయ్యాయి. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ల పరిధిలో 58.83 శాతం, పురపాలికల్లో 74.40 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. లైవ్ అప్‌డేట్స్.. * ఓట్ల లెక్కింపుకోసం 134 కేంద్రాల్లో 2,559 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు ముగ్గురు ఉంటారు. ఇందుకోసం మొత్తం 10 వేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 2,958 మంది సూపర్ వైజర్లు, 5,756 మంది అసిస్టెంట్లుగా ఉంటారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Go0QCc

Comments