కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రతి ఏడాది చేస్తూ వస్తున్న పని ఈసారి కూడా చేయాల్సిందే. భారత్‌లో జనవరి నుంచే ట్యాక్స్ ఫైలింగ్ తతంగం మొదలవుతుంది. మార్చి నెల చివరి వరకు ఇన్వెస్ట్‌మెంట్ల ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మంది ఇప్పటి నుంచి ట్యాక్స్ సేవింగ్ సాధనాల వైపు చూడటం ప్రారంభిస్తారు. భారత్‌లో దేశ జనాభాతో పోలిస్తే పన్ను చెల్లింపుదారులు తక్కువగా ఉన్నా కూడా వారు చెల్లించే పన్ను మొత్తం ఎక్కువగానే ఉంది. 2018-19లో ఇన్‌కమ్ ట్యాక్స్ కలెక్షన్లు రూ.4,42,170 కోట్లుగా నమోదయ్యాయి. ఇది చిన్న మొత్తం ఏమీ కాదు. అందుకే ఇక్కడ పన్ను చెల్లింపుదారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ట్యాక్స్ స్లాబ్స్‌కు అనుగుణంగా తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని గుర్తించాలి. ట్యాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల కచ్చితంగా పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత ప్లానింగ్ ఉండాలి. బేసిక్ ఇన్‌కమ్ ట్యా్క్స్ స్లాబ్స్ గురించి తెలిసుండాలి. మీరు 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటే సులభంగానే పన్ను ఆదా చేసుకోవచ్చు. దీనికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అదే మీరు 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే పన్ను ఆదా చేసుకోవడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. ట్యాక్స్ స్లాబ్స్ ఇలా రూ.5,00,000 వరకు పన్ను ఆదాయం కలిగినవారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. వీరికి ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. ఎలాంటి పన్ను పడదు. మోదీ ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఈ బెనిఫిట్‌ను ప్రకటించింది. ఇకపోతే పన్ను చెల్లింపుదారులు అదనంగా 4 శాతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్స్‌పై ఒక అవగాహన వచ్చే ఉంటుంది. ఇప్పుడు చేయాల్సిన పని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి ఆలోచించాలి. మీ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్లను ప్లాన్ చేసుకోవాలి. మీరు ఒక్కరిగా ఉంటే ఒక విధంగా, పెళ్లి చేసుకొన్ని ఉంటే మరోలా పెట్టుబడి ప్రణాళికలు మారతాయి. అవసరాలు ప్రాతిపదికన ఇన్వెస్ట్‌మెంట్లు కూడా మారాలి. హోమ్ లోన్ ఈఎంఐ నుంచి పిల్లల ట్యూషన్ ఫీజు వరకు పలు అంశాలపై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ఉన్నాయి. సింగిల్స్ కోసం.. పెళ్లి చేసుకోకుండా సింగిల్ ఉన్నప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి పలు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎడ్యుకేషన్ లోన్ ఉంటే.. అప్పుడు కచ్చితంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందే. ఎడ్యుకేషన్‌లోన్‌పై చెల్లించే వడ్డీ మొత్తంపై కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 ఈ కింద పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. దీనికి అదనంగా యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) ఎంచుకుంటే.. అప్పుడు మరిన్ని బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. యులిప్స్ విషయానికి వస్తే . హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్ 2 వెల్త్ ప్లాన్ వల్ల లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు ఇన్వెస్ట్‌మెంట్లకు రక్షణ కూడా లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి పొందొచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తీసుకోవడం వల్ల సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు తగ్గింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు చిన్న వయసులోనే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌ప్లాన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పెళ్లైన వారికి.. మీకు ఇప్పటికే పెళ్లి అయిపోయి ఉంటే, పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉంటే, లేదంటే ఇప్పటికే పిల్లలు ఉంటే.. మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలపై వీటి ప్రభావం ఉంటుంది. హోమ్ లోన్స్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల రూ.20 వేలు, రూ.88 వేలు లేదా మొత్తంగా రూ.1,00,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ ట్యాక్స్ స్లాబ్స్‌ప్రాతిపదికన ఆదా అయ్యే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లాన్ల విషయానికి వస్తే.. . ఇది ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ పాలసీ తీసుకోవడం వల్ల అనుకోని పరిస్థితుల్లో మరణించినా లేదంటే అంగవైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటివి సంభవించినప్పుడు ఈ పాలసీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది. 2018-19లో ఈ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 99.03 శాతంగా ఉంది. ఈ పాలసీతో జీవితాంతం లైఫ్ కవర్, లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్, ప్రీమియం మినహాయింపు వంటి పలు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇప్పటికీ కూడా మీరు ఇంకా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్‌పీఎస్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద అదనంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిటైర్మెంట్‌కు దగ్గరిలో ఉన్నారా? మీరు పదవీ విరమణ దగ్గరకు వచ్చేశారా? హోమ్ లోన్ ఈఎంఐలు చివరి దశకు చేరుకొని ఉంటాయి. లేదంటే పూర్తిగా చెల్లించేసి ఉంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, చిన్న వ్యాపారం ఇలా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కలిగి ఉండొచ్చు. అయితే వీరికి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. అలాగే వాలంటరీ ఈపీఎఫ్ ఫండ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఈపీఎఫ్ స్కీమ్, హోమ్ లోన్ పేమెంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల సెక్షన్ 80సీ కింద పూర్తి బెనిఫిట్స్‌ను పొందొచ్చు. దీనికి అదనంగా మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను, ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి. అలాగే గ్యారంటీ సేవింగ్స్ ప్లాన్‌లో డబ్బులు దాచుకుంటూ రావాలి. కచ్చితమైన రాబడి అందించే ప్లాన్లలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంచాయ్ ప్లస్ ప్లాన్ కూడా ఒకటి. కూడా అందిస్తోంది. 99 ఏళ్ల వరకు కచ్చితమైన రాబడి పొందొచ్చు. ప్రీమియం చెల్లింపు అయిపోయిన తర్వాత కూడా పాలసీ కొనసాగుతుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇలా.. రిటైర్మెంట్ తర్వాత లేదా సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక బెనిఫిట్స్ లభిస్తున్నాయి. వీరికి రూ.5,00,000 వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరింత డబ్బును ఆదా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ బాధ్యతలు భారం దించేసుకుంటారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఈఎల్ఎస్ఎస్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి అదనంగా పదవీ విరమణ చేసిన వారు యాన్యుటీ ప్లాన్స్ కొనుగోలు చేయడం వల్ల రెగ్యులర్ ఆదాయం పొందొచ్చు. ఇది సింగిల్ ప్రీమియం ప్రొడక్ట్. మీరు సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ప్లాన్‌లో చేరడం వల్ల వెంటనే లేదా కొంత కాలం ఆగి తర్వాత కూడా డబ్బులు పొందొచ్చు. మీరు ఏ వయసులో ఉన్నా కూడా ఆర్థిక ప్రణాళికలను మాత్రం అనుసరించండి. అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉండాలి. మీరు కొత్తగా ఉద్యోగంలోకి చేరినా, పదవీ విరమణ చేసినా ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను రిచెక్ చేసుకోండి. నిజంగానే పన్ను ఆదా ప్రయోజనాలు పొందుతున్నామా? అని ప్రశ్నించుకోండి. *సోర్స్- (ఈటీ స్పాట్‌లైట్ టీమ్ ఈ ఆర్టికల్‌ను పబ్లిష్ చేశారు. మీరు etspotlight@timesinternet.in ద్వారా వారిని సంప్రదించొచ్చు)
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2sXxTds
Comments
Post a Comment