Airtel ఉచిత వైఫై కాలింగ్.. సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లిస్ట్‌లో మీ మొబైల్ ఉందేమో చెక్ చేసుకోండి!
భారతదేశంలో ఎయిర్‌టెల్ మొట్టమొదటి సారిగా వైఫై కాల్‌ను పరిచయం చెయ్యడంతో, ఇక మీదట మన దేశంలో కాల్ డ్రాప్ అనే మాట వినిపించదు మరియు ఆ పదం పూర్తిగా గతానికి పరిమితం అయిపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సేవలు, దేశంలోని అన్ని ప్రధాన సర్కిల్స్‌లలో (జమ్మూ కాశ్మీర్ మినహా) ఉన్నటువంటి అన్ని బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్స్‌లోనూ మరియు అన్ని ప్రముఖ స్మార్ట్ ఫోన్‌లలో (క్రింద పట్టికను చూడండి) అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను డిసెంబర్‌లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 1.8 మిలియన్లకు పైగా ఎయిర్‌టెల్ కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. దీనితో ఈ టెలికాం దిగ్గజం, దేశంలో మొట్టమొదటి సారిగా తన చందాదారులకు వైఫై కాలింగ్‌ను అందించడంతో పాటు అతి పెద్ద యూజర్ బేస్ కలిగి ఉన్న నెట్‌వర్క్ గా కూడా అవతరించింది. కస్టమర్ల నుండి వచ్చిన ఈ సానుకూల స్పందనతో, ఎయిర్‌టెల్ ఇప్పుడు 17 వేర్వేరు బ్రాండ్‌లలో 100 కు పైగా పరికరాలలో అన్ని బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లకు ఈ సేవను విస్తరించింది. మీరు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడిన స్మార్ట్‌ఫోన్ లలో ఏదైనా ఉపయోగిస్తుంటే, ఆయా ఫోన్‌లలో వై-ఫై కాలింగ్‌ను ఎలా ఆక్టివేట్ చెయ్యాలో క్రింద పేర్కొనబడింది. వైఫై కాలింగ్ సర్వీస్ అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ ఫోన్లు కాలింగ్ అంటే ఏమిటి మరియు ఇది ఎలా పని చేస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే, ఎయిర్‌టెల్ నుండి వచ్చిన ఈ సర్వీస్ సహాయంతో మీరు ఇంటిలో ఉన్నప్పుడు సిగ్నల్ కోసం కిటికీల దగ్గర వేలాడడం, బాల్కనీలో పాట్లు పడడం వంటివి ఇక మీదట ఉండవు. గోడలు, భవనాలు వంటి అడ్డంకుల వలన తరచుగా మన ఫోన్ నెట్‌వర్క్‌ను కోల్పోతాము, ఈ సమస్యను ఎయిర్‌టెల్ పరిష్కరిస్తోంది. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్‌లో, మన వాయిస్ సెల్యులార్ నెట్‌వర్క్ ద్వారా కాకుండా, వైఫై నెట్‌వర్క్ ద్వారా ప్రసారం కాబడుతుంది. తద్వారా, ఇంటి లోపల ఉన్నప్పుడు అత్యుత్తమ కవరేజ్‌ను అందిస్తుంది. ఇళ్ళు మరియు ఆఫీస్‌లలో సెల్యులార్ నెట్‌వర్క్‌లు రద్దీగా ఉంటాయి, కాబట్టి మీరు మంచి వైఫైకు కనెక్ట్ అయిన చోట వైఫై కాలింగ్, HD సంభాషణను అందిస్తుంది. ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌తో, ఎయిర్‌టెల్ యూజర్లు ఇప్పుడు ఎవరికైనా, ఎక్కడికైనా కాల్ డ్రాప్స్ ఇబ్బందులు లేకుండా మంచి కాల్ క్వాలిటీతో కాల్ చెయ్యవచ్చు. మీ ఫోన్ లో ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను ఎలా ఆక్టివేట్ చేసుకోవాలి? వైఫై కాలింగ్ సేవలను ఆనందించడానికి, మీకు కావాల్సినదల్లా ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్‌తో ఒక ఎయిర్‌టెల్ మొబైల్ కనెక్షన్, మరియు పైన పేర్కొన్న స్మార్ట్‌ఫోన్లలో ఒక మొబైల్. తరువాత,
- కొత్త సాఫ్ట్‌వేర్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి
- VoLTE స్విచ్‌ను ఎనేబుల్ చెయ్యండి
- వై-ఫై కాలింగ్ స్విచ్‌ను ఎనేబుల్ చెయ్యండి
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3aIGBNQ
Comments
Post a Comment