మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి. Also Read: ఆదాయపు పన్ను పరిమితి పెంచుతారని, రైతుల కోసం ప్రత్యేక స్కీమ్స్ ఆవిష్కరణ, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్‌టీ తగ్గింపు వంటి అంశాలను ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఆలోచన ఎలా ఉందో ఇంకొన్ని గంటల్లో అందరికీ తెలుస్తుంది. Also Read: ఇకపోతే కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఆర్థిక సర్వే 2020ను ఆవిష్కరించింది. దేశ ఆర్థిక స్థితిగతులను ఇది ప్రతిబింబించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ రేటు 6-6.5 శాతం మధ్యలో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా పెరగొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. Also Read: మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితులు ఏమంత బాగోలేవు. జీడీపీ రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్టానికి పెరిగిపోయింది. డిమాండ్ పడకేసింది. కంపెనీలు కూడా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుండటం గమనార్హం. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2S8HcQb
Comments
Post a Comment