Mulugu Horoscope: డిసెంబరు 29 రాశి ఫలాలు- ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభాలు!

మేషం రక్త సంబంధీకులతో కష్టసుఖాలను పంచుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వస్తులాభాలు పొందుతారు. వృషభం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యుల సహాయసహకారాలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తిలాభాలు పొందుతారు. మిథునం ఖర్చులు ఆదాయానికి మించి పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు. కర్కాటకం సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. మిత్రుల నుంచి వ్యాపారపరంగా కీలక సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. సింహ కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కన్య ఆర్థికపరిస్థితి కొంత మెరుగుపడినా కుటుంబ అవసరాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. Read Also: తుల అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. కుటుంబంలో అదనపు సంపాదన మొదలవుతుంది. వృశ్చికం పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు నిదానంగా కొనసాగిస్తారు. వస్తులాభాలు పొందుతారు. ధనుస్సు విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనలాభాలు ఉంటాయి. మకరం చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సన్నిహితుల సహాయంతో సకాలంలో పూర్తిచేస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుంభం దూరప్రాంతాల్లోని మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరసోదరీమణులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు పొందుతారు. మీనం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2SwOjUt

Comments