Mulugu Horoscope: డిసెంబరు 25 రాశి ఫలాలు- మేష రాశివారికి ఆకస్మిక ధనలాభం!

మేషం సంఘంలో గుర్తింపు దక్కుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ధన, వస్తులాభాలు పొందుతారు. వృషభం ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం పొందుతారు. మిథునం ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. కర్కాటకం ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమ అధికం అవుతుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. సింహ సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు. కన్య మీ ప్రతిభకు సంఘంలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు కొనసాగిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. Read Also: తుల ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఋణాలు కొంత వరకు తీరుతాయి. చేపట్టిన పనులను నిదానంగా పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వృశ్చికం వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కదు. ధనుస్సు దూర ప్రాంతాల్లోని మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మకరం కుటుంబసభ్యులు, బంధువులు, చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. కుంభం వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మీనం మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన శుభ ఆహ్వానం ఆనందం కలిగిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నా అధిగమించి పనులు పూర్తిచేస్తారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2ZjvB47

Comments