నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి చెల్లెలి వరుసయ్యే చిన్నాన్న కుమార్తెపై రెండేళ్లుగా స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బీటీనగర్కు చెందిన యువతి (19) దివ్యాంగురాలు. పదో తరగతి చదివి ఇంట్లోనే ఉంటోంది. తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్తుండగా యువతి ఒంటరిగా ఇంట్లో ఉండేది. Also Read: దీంతో ఆమె పెదనాన్న కొడుకు నవీన్(25), స్నేహితుడు రవి(22) రోజూ వెళ్లి ఆమెను వేధించేవారు. రెండేళ్ల క్రితం ఆమెను బెదిరించి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడేవారు. అప్పటినుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆ కామాంధులిద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు నోరు విప్పలేదు. ఇటీవల ఆమె శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని కుమార్తెను నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. Also Read: దీంతో వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భిణి అని తేలింది. దీంతో ఏం చేయాలో తెలీక తల్లిదండ్రులు కులపెద్దలను ఆశ్రయించగా ఈ విషయం బయటకు రాకుండా వారు అడ్డుకున్నారు. దీంతో బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ సాయంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2u0KDA9
Comments
Post a Comment