శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు.
ములుగు వారి నవంబరు 27 బుధవారం పంచాంగం.
తేదీ |
వారం |
సూర్యోదయం-సూర్యాస్తమయం |
నవంబరు 27 |
సౌమ్యవాసరే |
ఉదయం 6.14- సాయంత్రం 5.20 |
Read Also:
సంవత్సరం |
కాలం |
రుతువు |
మాసం-పక్షం |
యోగం-కరణం |
తిథి |
శ్రీవికారినామ సంవత్సరం |
దక్షిణాయనం-శీతాకాలం |
హేమంత రుతువు |
మార్గశిర మాసం-శుక్లపక్షం |
సుకర్మ రాత్రి 8.24 వరకు తదుపరి ధృతి- కింస్తుఘ్నం ఉదయం 8.20 వరకు తదుపరి బవ రాత్రి 7.45 వరకు ఆ తదుపరి బాలువ |
పాడ్యమి సాయంత్రం 5.59 వరకు తదుపరి విదియ |
నక్షత్రం |
వర్జ్యం |
దుర్ముహూర్తం |
రాహుకాాలం |
అమృత ఘడియలు |
శుభసమయం |
అనూరాధ ఉదయం 8.12 వరకు తదుపరి జ్యేష్ఠ |
మధ్యాహ్నం 1.19 నుంచి 3.12 వరకు |
ఉదయం 11.32 నుంచి 12.17 వరకు |
మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు |
రాత్రి 12.24 నుంచి 1.59 వరకు |
ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00 వరకు |
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/34r2eyC
Comments
Post a Comment