AP LAWCET 2019 ఫైనల్ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు

పీలో మొదటివిడత లాసెట్‌ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తుదివిడత కౌన్సెలింగ్‌ తేదీలను అధికారులు వెల్లడించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రాసెసింగ్ చెల్లించని అభ్యర్థులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులు.. నిర్ణీత మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి నవంబరు 25, 26 తేదీల్లో నిర్వహించనున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. నవంబరు 25న మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ అభ్యర్థులకు, నవంబరు 26న ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేప్టనున్నారు. 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు నవంబరు 27న సాయంత్రం 27లోపు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు పూర్తిచేసినవారికి నవంబరు 28న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లను కేటాయిస్తారు. వీరు నవంబరు 30లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2O7Idak

Comments