'లక్ష్య' సాధనలో అవరోధాలను అధిగమిద్దాం ఇలా!

ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం.. చేయాల్సిన పనచికూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ.. లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. అంత సులువేం కాదు..లక్ష్యసాధన అనేది అంత సులువైనదేమీ కాదు.. ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. అనుకూల వాతావరణం లేకపోవడం, ప్రతికూల పరిస్థితులే లక్ష్య సాధనకు ప్రాథమిక అవరోధాలుగా ఉంటాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన లొంగిపోకూడదు.. కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను సాదరంగా ఆహ్వానించాలి. ప్రతికూల పరిస్థితులు లేదా అవరోధాలు ఎదురవుతాయన్న భయం ఏమాత్రం ఉండకూడదు. వాటికి ఎదుర్కొనడానికి శక్తి మేరకు ప్రయత్నించాలి. తద్వారా అవరోధాలపై విజయం సాధించడం మరింత సులభతరం అవుతుంది. ఒక అవరోధం తొలగి పోగానే పొంగిపోకూడదు.. మరిన్ని అవరోధాలు లక్ష్యసాధనకు ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించాలి. వాటిని కూడా సానుకూల ధోరణితోనే అధిగమించగలగాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. ఒక్కో అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే విజయం నల్లేరు మీద నడకే అవుతుందనడంలో సందేహం లేదు. Read More..➦ ➦


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2WpyChH

Comments