ప్రతిభకు తగ్గ 'ఉద్యోగమే' చేస్తున్నారా..!

చదువు పూర్తయినా.. ఉద్యోగం దొరకని పరిస్థితి నేడు. ఉద్యోగాలున్నా... సరైన నైపుణ్యాలున్నవారు దొరకడం లేదని కంపెనీలు అంటున్నాయి. ఇలాంటి సమయంలో ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఉద్యోగం వచ్చిందంటే చాలు... తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగం.. అవునా? కాదా? అన్నది అస్సలు పట్టించుకోరు. ఫలితంగా కొన్నాళ్లకు... అది నచ్చక మళ్లీ.. ఉద్యోగ వేటలో పడుతారు. లేదా ఉద్యోగం నచ్చలేదన్న కోపంతో మళ్లీ సరిపడని ఉద్యోగంలో చేరి అదే తప్పు రిపీట్ చేస్తారు. దీనివల్ల వారి ప్రతిభ, సమయం, వయసు వృథా అవుతుంది. ఇక చేసేది లేక అసంతృప్తితోనే ఏదో ఒక పనిలో ఇమిడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఉద్యోగంలో చేరే ముందు ఎవరికి వారు ఒకసారి ప్రశ్నించుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఓకే అనుకుంటేనే... ఆ ఉద్యోగంలో చేరాలి. ఇలా చేస్తే ఆనందంగా ఉద్యోగాన్ని చేయడంతో పాటు.. చేసే వృత్తిలోనూ రాణిస్తారు. Read Also: ఒకవేళ మీకు వ్యతిరేక సమాధానాలు వస్తే... మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకండి. తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగంలో చేరి... బంగారు భవిష్యత్తు కోల్పోకూడదు కదా. ఒకవేళ మీరు ఏదైనా దీర్ఘకాలిక ఉద్యోగంలో చేరుతున్నట్లయితే... కొన్నాళ్ల తర్వాత వచ్చే ప్రయోజనమేంటో ముందే ఆలోచించుకోవాలి. అనుభవం పెరిగే కొద్దీ వృత్తిలో అభివృద్ధి ఉంటుందా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఉద్యోగంలో విజయానికి తగిన వనరులను ఈ సంస్థ సమకూరుస్తోందా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ప్రతిభ, నైపుణ్యాలను సంస్థ సద్వినియోగం చేసుకుంటుందా లేదా అని ప్రశ్నించుకోవాలి. Read Also: అన్నివేళలా ఇలాంటి వైఖరి పనికిరాకపోవచ్చు... ఎందుకంటే... ఫ్రెషర్స్‌తో పోల్చితే... అనుభవం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యమివ్వడమే. అందుకు... అనుభవం కోసం ఏదో ఉద్యోగం చేసి... తర్వాత మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగంలో చేరవచ్చు. Read Also: భవిష్యత్తులో ఒకవేళ సంస్థను వదిలివెళ్లినా.. అక్కడి ఉద్యోగ అనుభవం, ప్రతిభ, నైపుణ్యాలు మంచి అవకాశాలను కలిగిస్తాయా అని ఆలోచించి ముందుకు సాగాలి. అప్పుడు విజయం మీవెంటే ఉండటం ఖాయం. Read Also: Read More..➦ ➦


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2q6DLPv

Comments