పసిడి ధర మళ్లీ పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల ఏకంగా రూ.250 పెరిగింది. దీంతో ధర రూ.40,220కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.230 పెరిగింది. దీంతో ధర రూ.36,870కు చేరింది. పసిడి ధర భారీగా పెరిగితే.. మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,770 వద్దనే నిలకడగా ఉంది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.38,850కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.37,650కు ఎగసింది. Also Read: బంగారం ధర పరుగులు పెడిడే.. కేజీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. దీంతో ధర రూ.48,770 వద్దనే నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,507.15 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 1.31 శాతం పెరుగుదలతో 18.03 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2ofc4DE
Comments
Post a Comment