ఏ సంస్థలో అయినా... ఉద్యోగం పొందాలంటే ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉంటుంది. ఎంపిక కోసం ఎన్ని రౌండ్లు నిర్వహించినప్పటికీ... చివరగా ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగం పొందుతారు. కొంతమంది ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ వారిలో సందిగ్ధత అలాగే ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో చేతుల్లో వణుకు, గుండెల్లో దడ, ఎలాంటి ముందస్తు కసరత్తు లేకపోవడం వంటివి చాలా మంది అభ్యర్థులు చేసే పొరపాట్లుగా చెప్పవచ్చు. అభ్యర్థులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా ఆలోచించాలి. ఒకవేళ ఎంపిక కాకపోకపోయినా.. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేకానీ ఏదో కోల్పోయామన్న భావనతో కుంగిపోకూడదు. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా సునాయాసంగా ఇంటర్వ్యూలో ఎలా విజయం సాధించాలో చూద్దాం....! ➥ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ ఇంటర్వ్యూకు వెళ్లిన ఇంటర్వ్యూ చేసేవాళ్లు ప్రథమంగా రెజ్యూమ్‌నే చూస్తారు. రెజ్యూమ్‌లో ఇచ్చిన అంశాల మేరకు ప్రశ్నలు అడుగుతారు. అందుకే రెజ్యూమ్‌లోని అంశాలు పక్కాగా.. ఉండేలా చూసుకోవాలి. ఎవరిదో రెజ్యూమ్ బాగుందని... దాన్ని యథావిధిగా కాపీ కొడితే... నీకు లేని నైపుణ్యాలను కూడా పేర్కొన్నట్లవుతుంది. సంబంధిత అంశంలో ప్రశ్నలు అడిగితే చెప్పడం కష్టమవుతుంది. అభ్యర్థులు తమ నైపుణ్యాలను, శక్తిసామర్థ్యాలను, అచీవ్‌మెంట్లను.. ఉన్నది ఉన్నట్లుగా రెజ్యూమ్‌లో తెలపాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగిన సులభంగా సమాధానం చెప్పవచ్చు. ➥ ఇంటర్వ్యూలో ఒకేరకమైన ప్రశ్నలు పరిశ్రమ, ఉద్యోగం, హోదా ఎలాంటిదైనా... ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు సాధారణంగా ఒకేలా ఉంటాయి. కానీ ఒక్కో అభ్యర్థి వారివారి శైలిలో సమాధానాలు చెబుతారు. వారు చెప్పే సమాధానాల ఆధారంగానే ఉద్యోగం వస్తుందా... రాదా... అన్నది తేలుతుంది. ➥ బలాలు - బలహీనతలు ఇంటర్వ్యూలో బలాలు, బలహీనతల గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏ అంశమైనా మీకు ప్రతికూలం కాకుండా చూసుకోవాలి. అనవసర విషయాలు చెబుతూ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. బలహీనతలు లేవని చెప్పడం వల్ల కూడా మీకొచ్చిన నష్టమేమీ లేదు. ➥ సంస్థ గురించి అవగాహనఏ సంస్థ అయినా ఇంటర్వ్యూ సమయంలో తమ గురించి చెప్పమని అడగడం సహజం.... దీనికనుగుణంగా... ముందుగానే సంస్థకు సంబంధించిన మౌలిక సమాచారం తెలుసుకొని ఉండాలి. దీని వల్ల ఇంటర్వ్యూలో అడిగే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇవ్వవచ్చు. ➥ ఉద్యోగాన్ని బట్టి సమాధానం ఉద్యోగానికి అనుగుణంగా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు... సమాధానాలు ఇవ్వాలి. ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు లౌక్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ➥ సంస్థకు ఎలా ఉపయోగపడతారు? మీ అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు సంస్థకు ఎలా ఉపకరిస్తాయో ఉదాహరణలతో వివరించగలగాలి. సంస్థ పురోభివృద్ధికి మీ సృజనాత్మకత తోడ్పడే విధానం చెప్పండి. ➥ విమర్శల స్వీకరణ విమర్శలను సానుకూల దృక్పథంతోనే స్వీకరిస్తా అని చెప్పాల్సి ఉంటుంది. పై అంశాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే .... ఇక ఉద్యోగం మీదే... ఆల్ ది బెస్ట్... Read More..➦ ➦
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/36j4lFK
Comments
Post a Comment