జబర్దస్త్ షోలో ఆది స్కిట్ వచ్చిందంటే... అందులో కచ్చితంగా ఉంటుంది. అతడితో కలిసి ఆడుతుంది. లేదా అతడు ఆడిన ఆటకు సై అంటుంది. ఎంట్రీ సాంగ్లోనో.. ఎమోషనల్ డైలాగ్‌లో ఎక్కడో చోట సింక్ అయ్యిపోయి.. సిగ్గులొలికిస్తుంది. అనసూయ వయసు గురించో.. పెళ్లి గురించో.. ఆమె అందం గురించో.. ఏదో ఒకదాని గురించి.. ఏదో ఒక నిమిషం ప్రస్తావించకుండా ఉండడు ఆది. అందుకే ఇప్పుడు రష్మీ, సుధీర్ల కంటే అనసూయ, ఆది జంట మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వారం షోలో స్కిట్ స్టార్ట్ కాగానే.. బండగా ఉన్న పెళ్లాన్ని వెంట తెచ్చుకుని వచ్చి స్టెప్స్ వేయలేక ఇబ్బంది పడ్డాడు ఆది. ‘స్కిట్ అంతా ఈవిడ్ని(భార్యని) చూడాలంటే.. ఆవిడ్ని(అనసూయని) ఓ సారి చూడాలి’ అంటూ రావడమే బిస్కెట్స్ బుట్ట మోసుకొచ్చాడు ఆది. దాంతో అనసూయ సిగ్గు మొగ్గేసింది. మెలికలు తిరుగుతూ నవ్వుకుంటుంది. ‘అనసూయా...’ అని గట్టిగా పిలుస్తాడు ఆది. ‘ఏమిటి ఆది?’ అడిగింది అనసూయ సిగ్గు పడుతూ.. ‘ఈ రోజు నువ్వు అసలు మామూలుగా లేవు.. ‘‘ఏ,బి,సి,డీ, ఇ, ఎఫ్, జీ, హెచ్.. ఐ, జె, కె’’ లా ఉన్నావ్’ అంటాడు ఆది. ఆ మాటలకు ‘అంటే’ అని అడుగుతుంది అనసూయ అయోమయంగా చూస్తూ.. ‘అడోరబుల్, బ్యూటిఫుల్, క్యూట్, ఎక్స్లెంట్, మాములుగా కాదు.. ఫ్యాషన్.., గ్లోరియస్, హాట్’ అని ఆగిపోతాడు ఆది. వెంటనే అనసూయ ‘మరి ఐ, జె, కె?’ అని అడుగుతుంది. వెంటనే ‘ ఐయామ్ జెస్ట్ కిడ్డింగ్’ అంటూ గాలి తీసేస్తాడు ఆది. వెంటనే ఆదినే మాట్లాడుతూ.. ‘జ్యోక్ జ్యోక్.. ఈవిడ మీద జ్యోక్ వేసినా అది కూడా జ్యోక్ అని చెప్పాలి అలాంటటి రిలేషన్ మాది..’ అంటూ తల గోక్కుంటూనే తనదైన శైలిలో ప్రేక్షకులకు పంచ్ వేస్తాడు ఆది. Read also: వరుస ప్రాసలతో, పంచ్‌లతో కేకలు పుట్టించే ఆది..‘ఎప్పుడూ పెళ్లి అయ్యిందనే నిరాశే ఉండరెందుకండీ మీకు’ అని భార్య అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చి కడుపుబ్బా నవ్వించాడు. ‘మాకు నిరాశ ఎందుకే..హేమమాలిని.. పెళ్లి అయిన మగాడినే చేసుకుంది. కరీనా కపూర్.. పెళ్లి అయిన మగాడినే చేసుకుంది. మరి మాకు కూడా ఉంటారు. నిరాశ ఎందుకు ఆశతో జీవించాలి.. ఏ అనూష్కానో వస్తాది మాక్కూడా’ అంటూ అనసూయ వైపు చూపించి చూపించనట్లుగా చేయితిప్పేస్తాడు ఆది. సీన్లోకి ఆది ఫ్రెండ్‌గా రామ్ ప్రసాద్ ఎంటర్ అవుతాడు. కాసేపు అతడి మీద పంచ్‌లు వేసిన ఆది.. ‘అసలు ఈ మనుషులకు మానవత్వం లేకుండా పోయిందెహే’ అంటాడు రామ్ ప్రసాద్‌తో ఆది. వెంటనే రామ్ ప్రసాద్..‘అసలు ఈ మానవత్వం అంటే ఏంట్రా?’ అంటాడు ఆత్రుతగా.. ‘ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా సరే.. ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు తనకంటూ ఓ టైమ్ కేటాయిస్తాం చూడూ అదే మానవత్వం అంటే’ అంటాడు ఆది అనసూయని ఉద్దేశిస్తూ.. దాంతో ఒక్కసారిగా జబర్దస్త్ నవ్వులు ఫక్కుమన్నాయి. ‘ప్రేమకు గాఢమైన ప్రేమకు తేడా ఏంటి?’ అని రామ్ ప్రసాద్ అడగగా.. ‘ఒకరి ఎదలో ఇంకొకరు నివసించారనుకో అది ప్రేమ. ఇద్దరూ పొదలు చాటుకెళ్లి పరవశించారనుకో అది గాఢమైన ప్రేమ’ అంటూ వివరణ ఇచ్చి నవ్వించాడు ఆది. మొత్తానికి ఆది భార్య, రామ్ ప్రసాద్ భార్య ఇద్దరూ ఉద్యోగం తెచ్చుకోమని తిట్టడంతో.. ఉద్యోగం వేటలో పడతాడు. అయితే ఒక సాప్ట్వేర్ కంపెనీ ఎండీ.. తన ప్రేమని దక్కించుకోలేక బాధపడుతుంటే.. ఆది, రామ్ ప్రసాద్‌లు అతడికి హెల్ఫ్ చేస్తామని, జాబ్స్ ఇస్తే చాలని ఒప్పించి.. ఎండీ వాళ్ల లవర్ కుటుంబాన్ని కలుసుకోవడం, అక్కడ రామ్ ప్రసాద్ ఆటో పంచ్‌లకు తట్టుకోలేక ఎండీ లవర్ వాళ్ల నాన్న ఆత్మహత్య చేసుకోవడం, దాంతో ఎండీకి వాళ్ల లవర్ బ్రేక్ అప్ చెప్పేయడం.. ఇలా అంతా భలే నవ్వు తెప్పిస్తుంది. మొత్తానికి ప్రేక్షకుల బీపీని పెంచేలాంటి డ్రెస్ వేసుకున్న అనసూయ.. ఈ వారం ఆది చెప్పినట్లే చాాలా హాట్‌గా కనిపించింది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2BIzEvI
Comments
Post a Comment