యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ & జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ)-2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 'గ్రూప్-ఎ' పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 15 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించేవారు అక్టోబరు 14లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. Jobs: * కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ - 2020 మొత్తం పోస్టులు: 102
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో (జియోలాజికల్ సైన్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ) మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: 01.01.2020 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. Read Also: దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల; పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. Read Also: ముఖ్యమైన తేదీలు.. ✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.09.2019 ✦ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి (ఆన్‌లైన్) చివరితేది: 15.10.2019. (సా.6 గం.) ✦ ఫీజు చెల్లించడానికి చివరితేదీ (ఆఫ్‌లైన్): 14.10.2019. ✦ దరఖాస్తుల ఉపసంహరణ: 22.10.2019 - 28.10.2019 (సా.6 గం.) ✦ ప్రిలిమినరీ పరీక్షతేదీ: 19.01.2020. ✦ మెయిన్ పరీక్ష తేదీ: 27.06.2020.
పోస్టులు | పోస్టుల సంఖ్య |
జియాలజిస్ట్ (గ్రూప్ - ఎ) | 79 |
జియోఫిజిస్ట్ (గ్రూప్ - ఎ) | 05 |
కెమిస్ట్ (గ్రూప్ - ఎ) | 15 |
జూనియర్ హైడ్రోజియాలజిస్టులు (సైంటిస్ట్ - బి) (గ్రూప్ - ఎ) | 03 |
మొత్తం పోస్టులు | 102 |
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2ljC0wu
Comments
Post a Comment