గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన దేశీ ఇంధన ధరలు నేడు శాంతించాయి. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగాయి. దీంతో హైదరాబాద్లో రూ.78.80 వద్ద, రూ.73.11 వద్ద నిలకడగానే ఉన్నాయి. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. దేశీ ఇంధన ధరలు గత 8 రోజుల్లో రూ.2కుపైగా పెరిగిన విషయం తెలిసిందే. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర స్థిరంగా రూ.78.47 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.72.44 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.78.10 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా నిలకడగా రూ.72.10 వద్దనే కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.13 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.67.07 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.79.79 వద్ద ఉంది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.70.37 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.89 శాతం తగ్గుదలతో 61.57 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.70 శాతం క్షీణతతో 56.89 డాలర్లకు తగ్గింది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2mVHApd
Comments
Post a Comment