పాఠశాల విద్యలో ఏపీ అదుర్స్.. 'తెలంగాణ' మాత్రం?

పాఠశాల విద్య విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ విషయంలో టాప్-5లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. ఉత్తర్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది. కేరళ తర్వాత రాజస్థాన్ (2), కర్ణాటక (3), ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (5) రాష్ట్రాలు టాప్-5లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో నిలవగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం 14వ స్థానానికి పరిమితమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలను పరిశీలించిన .. 30 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని 2016-17 గణాంకాల ప్రకారం ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ ర్యాంకు వివరాలను నీతిఆయోగ్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. వివిధ రాష్ట్రాలకు కేటాయించిన ర్యాంకులు..
రాష్ట్రం ర్యాంకు
కేరళ 1
రాజస్థాన్ 2
కర్ణాటక 3
ఆంధ్రప్రదేశ్ 4
గుజరాత్ 5
అసోం 6
మహారాష్ట్ర 7
తమిళనాడు 8
హిమాచల్ ప్రదేశ్ 9
ఉత్తరాఖండ్ 10
హరియాణా 11
ఒడిశా 12
ఛత్తీస్‌గఢ్ 13
తెలంగాణ 14
మధ్యప్రదేశ్ 15
ఝార్ఖండ్ 16
బిహార్ 17
పంజాబ్ 18
జమ్మూకశ్మీర్ 19
ఉత్తర్ ప్రదేశ్ 20
ఈ జాబితా నుంచి వెస్ట్ బెంగాల్‌ను మినహాయించారు. ఇక మణిపూర్, త్రిపుర, మిజోరం, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాలచల్ ప్రదేశ్, గోవాలను చిన్న రాష్ట్రాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. Read Also: Read Also: Read Also: Read Also:


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2n1OsBG

Comments