'సచివాలయ' పేపరు లీకేజీపై నేడు సమీక్ష.. ఏం తేలుస్తారో?

ఏపీలో గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కార్యాలయంలోనే లీకయ్యాయంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తేల్చేందుకు ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు సోమవారం (సెప్టెంబరు 23) మధ్యాహ్నం 2.30 గంటలకు సమీక్ష జరపనున్నారు. ఏపీపీఎస్సీ కమిషనర్ మౌర్య ఇప్పటికే దీనిపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సీనియర్ అధికారి దీనిపై విచారణ చేపట్టారు. విచారణ నివేదికను ఆయన కమిషన్ ముందు ఉంచనున్నారు. దీనిపై కూడా భేటీలో చర్చ జరగనుంది. సమావేశానంతరం వివరాలను వెల్లడించనున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. Read Also: ఏపీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సచివాలయ పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడం.. ఏపీపీఎస్సీ ఉద్యోగుల బంధువులకు మంచి ర్యాంకులు రావడంపై మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఓ పత్రికలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన ఉద్యోగి పరీక్ష రాసి టాపర్‌గా నిలిచాడని, ఎగ్జామ్ టాపర్లలో ఏపీపీఎస్సీలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు ఉన్నారని వివరాలతో సహా ప్రకటించింది. అయితే.. సదరు పత్రిక ప్రభుత్వంపై దురుద్దేశంతో తప్పుడు కథనాన్ని ప్రచురించిందనేలా కాకుండా.. పేర్లతో సహా వివరాలను వెల్లడించడంతో.. పరీక్షలు రాసిన దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు అవాక్కయ్యారు. ఇంత తతంగం జరిగిందా? అనే అనుమానాలు వారిలో మొదలయ్యాయి. ఏపీపీఎస్సీలో పని చేసే వారికి, పేపర్ టైప్ చేసేవారికి ఎగ్జామ్ రాసే అవకాశం ఎందుకిచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఏపీపీఎస్సీలో చంద్రబాబు మనుషులున్నారనే భావన ఉన్నప్పుడు.. ఏదో యూనివర్సిటీకి ఇచ్చి ఉండాల్సింది అనే వాదన వినిపిస్తోంది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/30gXnlz

Comments