ధోనీ బాధ్యతలు రోహిత్ చేతికి.. ఒప్పించిన కోహ్లి

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత రెండేళ్లుగా మైదానంలో నిర్వహించిన సలహాలు, సూచనల బాధ్యతల్ని ఇకపై నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి స్వయంగా రోహిత్ శర్మతో మాట్లాడి.. అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. Read More: కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌలర్లకి సలహాలు ఇవ్వడంతో పాటు ఫీల్డింగ్ మార్పు వ్యవహారాల్ని ధోనీ చూసుకునేవాడు. కానీ.. తాజాగా టీమిండియా‌కి దూరంగా ధోనీ ఉండిపోతుండటంతో ఆ బాధ్యతల్ని సీనియర్ ఆటగాడు, వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకి అప్పగించినట్లు తెలుస్తోంది. Read More: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా నాలుగు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ.. గత ఏడాది భారత్‌కి కెప్టెన్‌గా నిదహాస్ ట్రోఫీ అందించిన విషయం తెలిసిందే. దీంతో.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతడి అనుభవాన్ని వినియోగించుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇప్పటికీ ఏ టీ20, వన్డే సిరీస్‌లోనైనా విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ చేతికే పగ్గాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ముందే రోహిత్ శర్మతో కోహ్లీ, రవిశాస్త్రి చర్చించగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. మొహాలి వేదికగా జరిగిన రెండో టీ20లో అనధికార కెప్టెన్‌గా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పు వ్యవహారాలు చూసిన రోహిత్ శర్మ.. ఒకానొక దశలో హార్దిక్ పాండ్యాకి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. Read More: ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వాటికి బలాన్ని చేకూరుస్తూ ఇద్దరూ వెస్టిండీస్ పర్యటనలో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. అయితే.. తాజాగా రోహిత్ శర్మని మూడు ఫార్మాట్లలోకి భారత సెలక్టర్లు ఎంపిక చేయగా.. కెప్టెన్ కోహ్లీ కీలక బాధ్యతలు అప్పగించాడు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2llBk9Y

Comments