పసిడి మళ్లీ పరిగెత్తింది. రూ.40,000 మార్క్‌పైకి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల ఏకంగా రూ.670 పెరుగుదలతో రూ.40,150కు ఎగసింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.590 పెరుగుదలతో రూ.36,800కు చేరింది. బంగారం ధర పరుగులు పెడితే.. మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.45 పెరుగుదలతో రూ.47,845కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 1.15 శాతం పెరుగుదలతో 1,554.75 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 1.53 శాతం పెరుగుదలతో 17.82 డాలర్లకు ఎగసింది. Also Read: ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ.38,800కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరుగుదలతో రూ.37,600కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.45 పెరుగుదలతో రూ.47,845కు చేరింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2ZrDEOC
Comments
Post a Comment