పసిడి మళ్లీ పరిగెత్తింది. రూ.40 వేల మార్క్‌పైనే కదలాడుతోంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల ఏకంగా రూ.410 పెరుగుదలతో రూ.40,560కు ఎగసింది. ఇది అల్‌టైమ్ గరిష్ట స్థాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.380 పెరుగుదలతో రూ.37,180కు చేరింది. బంగారం ధర పరుగులు పెడితే.. కూడా భారీగానే పెరిగింది. కేజీ వెండి ధర రూ.320 పెరుగుదలతో రూ.48,165కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1,538.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 17.83 డాలర్లకు ఎగసింది. Also Read: ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ.39,400కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.600 పెరుగుదలతో రూ.38,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా పరుగులు పెట్టింది. రూ.320 పెరుగుదలతో రూ.48,165కు చేరింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/33WsMYJ
Comments
Post a Comment