పసిడి పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల కేవలం రూ.10 పెరుగుదలతో రూ.40,280కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,910కు చేరింది. బంగారం ధర స్వల్పం పైకి కదిలితే.. మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.49,160 వద్ద నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,551.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 18.47 డాలర్లకు ఎగసింది. Also Read: ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.39,200కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 క్షీణతతో రూ.38,000కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.49,160 వద్ద నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2MHHgWU
Comments
Post a Comment